జపాన్‌ను అల్లకల్లోలం చేసిన తుపాన్..వేలమంది తరలింపు
జపాన్ దేశాన్ని తుపాన్ కుదిపేస్తోంది. భారీ వర్షాలతో వరద ముప్పు ఏర్పడింది. జపాన్‌లోని నాలుగు నగరాలలో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ఇషికావా అనే ప్రాంతంలో 12 నదులు నీటిమట్టాన్ని దాటి ప్రమాదస్థితిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో భారీగా వేల సంఖ్యలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా అక్కడ వాజిమా, సుజులో, నిగాటా నగరాలలో 46 వేల మంది ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.


 
							 
							