NewsTelangana

రాష్ట్రాన్ని ఏమి చేయలేని టీఆర్‌ఎస్‌.. దేశానికి ఏం చేస్తుంది..?

తెలంగాణ సెంటిమెంట్‌తో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌… 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి తెలంగాణ ప్రజలపై భారం వేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంత్రాలు, తంత్రాలు నెపంతో కేసీఆర్‌ సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టలేదని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణను మరిచిపోతున్న టీఆర్‌ఎస్‌… దేశానికి ఏం చేస్తుందని విమర్శించారు.