Home Page SliderTelangana

రెండోసారి ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ, రేపు మళ్లీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత విచారణ 10 గంటల పాటు కొనసాగింది. గత నెల 11 న విచారణ సందర్భంగా కవిత 8 గంటలకు పూర్తై.. బయటకు వచ్చారు. ఐతే ఈసారి కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. రేపు మళ్లీ విచారణ నిమిత్తం హాజరు కావాలని కవితకు ఈడీ అధికారులు చెప్పారు. ఇవాళ కేసులో కీలక నిందితుడుగా ఉన్న పిళ్లైను, మధ్యాహ్నం కవితతో కలిసి ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కవితతోపాటు ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అమిత్ అరోరాను కూడా ఈడీ విచారిస్తున్నట్టు సమాచారం. కవిత విచారణ జరుగుతున్నంత సేపు ఈడీ కార్యాలయంలోనే అడిషనర్ ఏజీ రాంచంద్రరావు, అడ్వొకేట్లు సోమ భరత్, గండ్ర మోహన్ రావు ఉన్నారు.