ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు సుప్రీం కోర్టు నిరాకరణ
ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామన్నారు సుప్రీం కోర్టు సీజేఐ. ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఈనెల 17న సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించనుంది. అప్పటి వరకు కేసు విచారణపై స్టేటస్ కో ఇవ్వాలని ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు. హైకోర్టులోనూ తీర్పు అపాలని కోరగా… అందుకు కూడా ఆయన అంగీకరించలేదు. ఆధారాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని… సాక్ష్యాలు వారి చేతికి వెళ్తే ఇక చేయడానికి ఏమీ ఉండదన్నారు తెలంగాణ ప్రభుత్వ లాయర్.

