Breaking News

అభిమాని మృతితో..టీజర్ వాయిదా వేసిన టాలీవుడ్ యంగ్ హీరో

సాయిధరమ్ తేజ్ కొన్ని నెలల క్రితం బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆయన ఇటీవల కాలంలోనే కోలుకున్నారు. ఆయన కోలుకున్న తరువాత నటిస్తోన్న చిత్రం “విరూపాక్ష”. ఈ సినిమా దర్శకుడు కార్తీక్. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల కావాల్సివుంది. అయితే అది తాజాగా వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం సాయిధరమ్ తేజ్ భీమరం అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న రావూరి పండు నిన్న క్రికెట్ ఆడుతూ..గుండెపోటుతో మరణించారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. కాగా టీజర్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని విరూపాక్ష టీమ్ స్పష్టం చేసింది. రిపబ్లిక్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా..సంయుక్త కథానాయికగా నటించారు. సుకుమార్ ఈ సినిమాకి స్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమా టీజర్‌ను పవన్‌కళ్యాణ్ నిన్న వీక్షించి,చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. కాగా ఈ రోజు “విరూపాక్ష” టీజర్ విడుదల కావాల్సివుండగా.. పండు మృతి చెందడంతో వాయిదా వేశారు.