Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కాగా కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు 164 స్థానాల్లో గెలిచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఈ నెల 9 న ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట పార్టీ శ్రేణులు ప్రకటించాయి. అయితే ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు ఏపీ క్యాబినెట్ ఏర్పాటు చేయడానికి కూడా ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్కడ జరుగుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.