“మూడో పాట, పాటకు మించిన ఆట” – రామజోగయ్య శాస్త్రి
Jr.NTR నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫియర్ మరియు చుట్టమల్లే పాటలు విడుదల అయ్యి అదరగొడుతున్నాయి.
తాజాగా మూడవ పాటపై రామజోగయ్య శాస్త్రి గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు .
అది ఏమిటంటే, ” మూడో పాట, పాటకు మించిన ఆట, కన్నుల పండుగ. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడు అని అడగకండి. ఎప్పుడొచ్చినా బీభత్సమే. ఈ ఆల్బం వేరే లెవెల్ అంతే ” అని Xలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు.
దీంతో ఆ పాట ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

