గవర్నర్‌పై తెలంగాణా సర్కార్ గుస్సా
గతకొంతకాలంగా తెలంగాణా ప్రభుత్వానికి ,గవర్నర్‌కు మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో పదుల సంఖ్యలో బిల్లులకు ఇప్పటికీ గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించలేదు. దీంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ గవర్నర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదించేలా ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఈ పిటిషన్‌కు తెలంగాణా గవర్నర్ సెక్రటరీ ప్రతివాదిగా వ్యవహరించనున్నారు. తెలంగాణా సర్కార్ మొత్తం 10 బిల్లులపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.