తెలంగాణ బడ్జెట్‌లో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి పెద్దపీట వేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ను నేడు తెలంగాణ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు.
మూసీ నది ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు
విమానాశ్రయం వరకూ మెట్రో ట్రైన్ విస్తరణకు రూ.100 కోట్లు
రింగు రోడ్డు ప్రాజెక్టుకు రూ.1525 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
వైద్యం, ఆరోగ్యాలకు రూ.11,468 కోట్లు కేటాయించారు.

