RGV “వ్యూహం” టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. గతంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాలను పురిగొల్పిన ఆయన మరోసారి అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న వ్యూహం సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో YSR మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన పరిణామాలను చూపించారు. అంతేకాకుండా జగన్ ఓదార్పు యాత్ర,సీబీఐ అరెస్ట్ చేయడం,విడుదల తదితర విషయాలను కూడా ఈ సనిమాలో ప్రధానంగా చూపించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, ఆయన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. అయితే ఈ సినిమా అనంతరం రామ్‌గోపాల్ వర్మ జగన్ సీఎం అయిన తర్వాత పరిస్థితులపై శపథం సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

