Andhra PradeshHome Page Slider

కేంద్ర బడ్జెట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర బడ్జెట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా రాజధాని అమరావతికి నిధులు, పోలవరం, రైల్వే ప్రాజెక్టులు, విజయవాడ-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని భావిస్తోంది. కాగా వీటి కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు నివేదికలు సమర్పించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి ఏమి కేటాయిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.