ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేయాలన్న పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నియామకంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కోర్టు గురువారం విచారణ జరపనుంది. మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఫిబ్రవరి 14న అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడం, మార్చి 8న అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో ఖాళీలు ఏర్పడ్డాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాలి. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న ప్రకటించి, ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో నిర్వహించగా.. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

