Home Page SliderInternational

24 గంటలూ సూర్యుడు వెలుగుతూనే వుంటాడు.. అదెక్కడో తెలుసా?

భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. అయితే.. ఈ భూమి మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయని చాలా మందికి తెలియదు. అర్ధరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగే ఉంటుంది. 24 గంటలూ సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు. అదెలా జరుగుతుందని ఆశ్యర్యపోతున్నారా…? కానీ ఇది నిజం. మరి సూర్యుడు అసలు అస్తమించకపోతే ఏం జరుగుతుంది? అసలు అలా జరగడం సాధ్యమేనా? భూమిపై అలాంటి ప్రాంతాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ప్రాంతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. నార్వేలో 76 రోజులు
    ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా పట్టపగలు మాదిరి ఎండ కొడుతుంది. మే నుంచి జూలై మధ్యలో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రం మబ్బుల చాటుకు వెళ్తాడు. నార్వేలోని స్వాల్ బార్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు.
  2. నునావట్, కెనడా.. రెండు నెలలు
    ప్రపంచంలోని రెండో అతిపెద్ద దేశం కెనడా. కెనడాలోని చిన్న నగరం నునావట్. ఇక్కడ రెండు నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. అదే సమయంలో శీతాకాలంలో ఈ ప్రాంతం 30 రోజుల పాటు పూర్తిగా చీకట్లోనే ఉంటుంది. ఇక్కడి యూకోన్ లో ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది.
  3. ఐస్ లాండ్.. నెల రోజులు
    యూరప్ లో గ్రేట్ బ్రిటన్ తర్వాత అతి పెద్ద ద్వీపమైన ఐస్ లాండ్ లో జూన్ నెల మొత్తం సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజులు ఇక్కడి వాళ్లకు రాత్రి, పగలు అన్న తేడా ఉండదు. పర్యాటకంగా ఐస్ లాండ్ మంచి ఆదరణ ఉంది. చాలా పర్యాటకులు జూన్ నెలలో ఎక్కువగా వస్తుంటారు.
  4. బారో, అలస్కా.. రెండు నెలలు
    అమెరికా రాష్ట్రమైన అలస్కాలోని బారోలో మే నెల చివరి నుంచి జూలై చివరి వరకూ సూర్యుడు అస్తమించడు. ఇక నవంబర్ మొదటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో అసలు సూర్యడు ఉదయించడు. అంటే పూర్తి చీకటిగా ఉంటుంది. దీనినే పోలార్ నైట్ అని పిలుస్తారు.
  5. ఫిన్లాండ్.. 73 రోజులు
    అందమైన సరస్సులు, ద్వీపాలకు పెట్టింది పేరైన ఈ దేశంలో ఏడాదికి 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా పట్టపగల్లానే కనిపిస్తుంది. అయితే చలికాలంలో మాత్రం అసలు సూర్యుడే కనిపించడు.
  6. స్వీడన్.. ఆరు నెలలు
    ఈ దేశంలో అత్యధికంగా సూర్యుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రకాశిస్తూ కనిపిస్తాడు. మే నుంచి ఆగస్ట్ మధ్యలో అర్ధరాత్రి అస్తమించి, మళ్లీ ఉదయం 4.30 గంటల సమయంలోనే ఉదయిస్తాడు.