పాక్ సైనికుల్ని మట్టుబెట్టిన ఆత్మాహుతి దాడి..
పాకిస్తాన్‌లో అంతర్యుద్దం పతాక స్థాయికి చేరుకుంటుంది.ప్రతీ నెలా నాలుగుకి తగ్గకుండా బాంబు దాడులు,సైనికులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనూ ఈ దాడుల పరంపర సాగుతోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థకు పాక్ ఆర్మీకి గత కొన్నేళ్ల నుంచి అవిశ్రాంత యుద్దం జరుగుతూనే ఉంది.పొరుగునే ఉన్న ఆఫ్ఘాన్ …బెలూచిస్థాన్ ఉగ్రవాదుల స్థావరంగా మారింది.గతంలో ఈ యుద్దం సరిహద్దుల్లో మాత్రమే పరిమితమయ్యేది.ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ అంతర్భాగంలోకి చొచ్చుకు వచ్చాయి. ఆ దేశ పరిపాలనా వ్యవహరాలకు, ఆర్మీ నిర్వహణ-భద్రతలకు బెలూచిస్తాన్ ఉగ్రవాదులు కొరకరాని కొయ్యగా మారారు.ఈ నేపథ్యంలో గత రెండు రోజుల కిందట తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మృతిచెందగా, 30 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ‘ఫిదాయీ సంగత్ బహర్ అలీ’గా గుర్తించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.