Home Page SliderTelangana

పెంపుడు శునకం ఆకస్మిక మృతి.. మంత్రి కంటతడి..

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌ కంటతడి పెట్టారు. చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు.. మూగ జీవాల‌తోనూ భావోద్వేగభ‌రిత సత్సంబంధాలు నెరిపిన మనసున్న నేత మంత్రి సురేఖ‌ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న హ్యాపీ(పెంపుడు కుక్క‌) చ‌నిపోవడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది క‌న్నీటి ప‌ర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.