Home Page SliderNational

టీచర్ చైర్ కిందే బాంబు పెట్టిన స్టూడెంట్స్

టీచర్ పనిష్మెంట్స్ ఇస్తోందని పగ పట్టిన స్టూడెంట్స్ కొందరు మహిళా టీచర్ చైర్ కిందే బాంబు పెట్టిన సంఘటన హర్యానాలో జరిగింది. సైన్స్ టీచర్‌పై పగపట్టిన 12 వ తరగతి పిల్లలు కొందరు ప్రాంక్ పేరుతో ఫైర్ క్రాకర్స్ తరహాలో ఉండే బాంబులు తీసుకువచ్చారు. వారు యూట్యూబ్ సహాయంతో రిమోట్‌తో పేలే విధంగా వాటిని స్వయంగా తయారు చేయడం విశేషం. వాటిని తెచ్చి టీచర్ వచ్చే ముందే కుర్చీ కింద దానిని అమర్చగా, మరో విద్యార్థి రిమోట్‌తో బాంబు పేల్చాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. పెద్ద శబ్దం రావడంతో టీచర్లందరూ వచ్చి ఆమెకు అండగా నిలిచారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని విద్యాధికారులను డిమాండ్ చేశారు. దీనితో విచారణ చేసిన అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడి, టీచర్లకు విద్యార్థులతో క్షమాపణలు చెప్పించారు. 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విద్యార్థులను పెద్దమనసుతో బాధిత టీచర్ క్షమించినట్లు సమాచారం.