రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ రివర్స్ గేర్ లో ఉంది
హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల ద్రవ్యోల్బణంలోకి జారుతున్నట్లు, ఇది వరుసగా రెండో నెల కూడా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. జూన్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం -0.93%గా ఉంటె , జూలైలో -0.44%కు పడిపోయిందని హరీశ్ రావు వివరించారు. ఇది సాధారణ పరిస్థితి కాదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్‌లో ఉందనడానికి ప్రమాదకర సంకేతం అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత రిజర్వ్ బ్యాంక్ సూచించిన 2–6% ద్రవ్యోల్బణం లక్ష్యం తెలంగాణలో సాధ్యంకాకపోవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు “రెడ్ అలర్ట్” అని పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రము లో వ్యాపార, వినియోగదారుల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయడం వంటి సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.