కొత్త రేషన్ కార్డుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. శనివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు దామోదర రాజానరసింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డుల తో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరీకి మంత్రివర్గ ఉప సంఘం విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం.