Home Page SliderPoliticsTelanganatelangana,

‘కేంద్ర పథకాలకు రాష్ట్రప్రభుత్వం ఫోటోలు పెడుతోంది’..బండి సంజయ్

కేంద్ర నిధులతో నడిచే సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం  ఇందిరమ్మ పేరు పెడుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు, పేర్లతో ప్రచారం చేసుకుంటోందని విమర్శలు కురిపించారు. రేషన్ ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఫోటోలు పెడుతున్నారని, రైతు వేదిక డబ్బు కేంద్ర ప్రభుత్వానివని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అబివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తోంది. అభివృద్ధి చేయడంపై రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదు. పేరు కోసం పాకులాడుతున్నారు అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు సంవత్సరం దాటినా ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.