Home Page SliderNational

‘సలార్’ చిత్రంలో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరో

కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్‌నీల్, క్రేజీస్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ ‘సలార్’ చిత్రం. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు దీనికోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ నీల్. అయితే ఈ చిత్రంపై ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. కేజీఎఫ్ హీరో ‘యశ్’ కూడా సలార్ చిత్రంలో కనిపిస్తాడని తెలుస్తోంది. దీనితో ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. సలార్ చివరి 10 నిముషాలు యశ్ కనిపిస్తాడని, థియేటర్లను షేక్ చేస్తాడని అంటున్నారు. అసలు కేజీఎఫ్ 3 చిత్రం సలారే అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ సలార్ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని డైరక్టర్ పేర్కొనడంతో ఆ వార్తలు మరుగున పడ్డాయి. సలార్ చిత్రం అప్పుడే ఓవర్సీస్‌లో 90 కోట్లకు అమ్ముడు పోయిందని న్యూస్.