Andhra PradeshHome Page Slider

ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం

కాంట్రవర్సి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను అరెస్టు చేయడానికి టీం రెడీ అయింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పీఎస్ విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.