రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై కేవలం రూ.10వేలకు కక్కుర్తిపడి కటకటాల పాలయ్యాడు. ఓ కేసులో ముద్దాయిల పేర్లను తొలగించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు ఎస్సై అరుణ్.దీంతో బాధితుడు ఏసిబిని ఆశ్రయించాడు.వెంటనే రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు వలపన్ని ఎస్సైని పట్టుకున్నారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్టేషన్ రైటర్ రామస్వామిని కూడా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.అరెస్ట్ చేసి వారిని ఏసిబి కోర్టులో హాజరు పరిచారు.