తండ్రి నాలుక కోసిన కొడుకు
రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి.. డబ్బు కోసమో,ప్రేమ కోసమో, క్షణికమైన సుఖాల కోసమో, సొంత బంధాలను తెంచేసుకుంటున్నారు దుర్మార్గులు… మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన గుండెను కలచివేసేంత దారుణంగా ఉంది. ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతు రూ. 6 వేలు రైతు భరోసా పథకం కింద పొందగా, ఆ డబ్బు కోసం అతని కుమారుడు సంతోష్ తన తండ్రిని చితకబాది, చివరకు కొడవలితో నాలుకను కోసేసిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.కేవలం కొన్ని ఆరు వేల రూపాయల కోసం కన్న తండ్రిపై ఇంతటి అమానుషంగా ప్రవర్తించడం సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారాయో చూపిస్తోంది. ఇది మన కుటుంబ బంధాలు, విలువలు ఎటు పోతున్నాయో ప్రతిబింబిస్తుంది.ప్రస్తుతం కీర్యా పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది డబ్బు కంటే మానవ సంబంధాలు గొప్పవి అన్న నిజాన్ని గుర్తించాల్సిన సమయం ఇది.