crimeHome Page SliderNationalNews

“అక్కని ఎక్కువ ప్రేమిస్తున్నారు.”.. తల్లిదండ్రులని చంపిన కొడుకు…

బుధవారం ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం రేపింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా షాకింగ్ నిజం బయటపడింది. రాజేష్ కుమార్ (51), అతని భార్య కోమల్ (46)కి ఇద్దరు సంతానం, కవిత (23) మరియు అర్జున్ (21). అయితే అర్జున్ చదువులో వెనుకబడి ఉండేవాడు. దానితో అతని తండ్రి తనని కాస్త మందలించేవాడు. అంతేకాకుండా, అతని తల్లిదండ్రులు తన కంటే తన సోదరిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు అర్జున్ కి అనుమానం మొదలయ్యింది. ఆ అనుమానంతోనే తండ్రి తమ ఆస్తి మొత్తం తన అక్కకే రాస్తాడు అని అనుకున్నాడు. ఆ కోపంతో వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఎవ్వరికి అనుమానం రాకుండా తమ తల్లిదండ్రుల పెళ్ళి రోజే తన తల్లిని, తండ్రిని మరియు అక్కని కత్తితో పొడిచి చంపాడు. పోలీసుల విచారణలో అర్జున్ పొంతన లేని వాంగ్మూలాలు ఇవ్వడంతో పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేసారు. గట్టిగా ప్రశ్నించేసరికి తన కుటుంబాన్ని చంపింది తానేనని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.