Home Page SliderNational

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బుడ్డోడు.. తెలిస్తే షాక్..

ఓ ఐదేళ్ళ బుడ్డోడు తన తండ్రిపై కంప్లైంట్ పెట్టాడు. ‘మా నాన్న ఆడుకోనివ్వట్లేదని, నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదని, తరుచుగా నన్ను కొడుతున్నాడని’ అంటూ వచ్చీరాని మాటలతో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఇక్బాల్ ను వెంటనే జైలులో పెట్టాలని కొడుకు హసనేన్ ఏడుస్తూ పోలీసులతో చెప్పాడు. అతను చెప్పిన మాటలను పోలీసులు శ్రద్ధగా విని, ‘సరే మీ నాన్నను జైలులో పెడతామని’ ఆ పిల్లోడితో చెప్పి ఓదార్చారు. అయితే తన తండ్రితోపాటు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాకానేర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.