home page sliderHome Page SliderTelangana

బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ..

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులకు గాలం వేశారు కంపెనీ నిర్వాహకులు. ప్యూరోపాల్ క్రియేషన్ & ఐటీ సొల్యూషన్స్ కంపెనీ మోసాలకు పాల్పడింది. బాధితుల నుంచి విడతల వారీగా ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. ఈ కంపెనీపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటూ తమకు న్యాయం చేయండని ఉద్యోగులు వేడుకుంటున్నారు.