Home Page SliderInternational

అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాన్…వేలాది విమానాలు రద్దు

అమెరికాను మళ్లీ మంచు పరదా కప్పేస్తోంది. అనేక రాష్ట్రాలు మంచులో వణికిపోతున్నాయి. న్యూయార్క్, మిచిగాన్, ఇండియానా వంటి ప్రాంతాలను మంచు తుఫాన్ విలవిలలాడిస్తోంది. భారీగా మంచు కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలలో ఉష్ట్రోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు చేరుకుంది. రోడ్లపై దాదాపు 20 అంగుళాల మంచు పేరుకుపోయింది. ఇంట్లో నుండి అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. విమాన సర్వీసులు అన్ని రాష్ట్రాలలో రద్దుచేయబడ్డాయి. స్కూళ్లు, కళాశాలలు మూతబడ్డాయి. 2000 విమానాలు రద్దు కాగా, 15 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దక్షిణ కాలిఫోర్నియా పర్వత ప్రాంతాల్లో సముద్రతీరంలో 14 అడుగుల వరకు అలలు రావచ్చని, మంచు తుఫాన్లు కూడా రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ఓపక్క మంచుతుఫానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ఒహియోవ్యాలీ, దక్షిణాది ప్రాంతాలు మాత్రం ఎండవేడితో అల్లాడిపోతున్నాయి.