ఆరో జాబితా విడుదల చేసిన వైసీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. అభ్యర్థుల మార్పు కొనసాగుతోంది. తాజాగా రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి తనయుడు వెంకట రమణ, చిత్తూరు ఎంపీగా రెడ్డప్పను తిరిగి నియమించింది. ఇక మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్, మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, గిద్దలూరు నుంచి కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి ఎండీ ఖలీల్, జీడీ నెల్లూరు నుంచి కె నారాయణ స్వామి, ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకకు పార్టీ అవకాశం కల్పించింది. గతంలో ఎంపీగా పేర్కొన్న నారాయణ స్వామిని తిరిగి జీడీ నెల్లూరుకు మార్చగా, ఎమ్మిగనూరు నుంచి అభ్యర్థిని పార్టీ మార్చింది.


