Home Page SliderInternationalTrending Today

ముక్కు ద్వారా గొంతులోకి బొద్దింక, వైద్యులకే షాక్

ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక రోజు తీవ్రమైన దగ్గు వచ్చింది. దాంతోపాటు శ్వాస నుంచి దుర్వాసన కూడా వస్తుందని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ అతనికే కాకుండా అక్కడి డాక్టర్లు కూడా ఖంగుతినే నిజం బయటపడింది. వివరాల్లోకి వెళితే చైనాలోని హెనన్ ప్రావిన్స్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ళ వ్యక్తి రాత్రి పూట నిద్రపోతున్న సమయాన ఓ బొద్దింక ముక్కు ద్వారా గొంతులోకి వెళ్ళింది. కాని ఈ విషయం ఆ వ్యక్తి గమనించుకోలేదు. మూడు రోజుల తర్వాత సదరు వ్యక్తికి అసౌకర్యంగా అనిపించడం, తీవ్రమైన దగ్గు, శ్వాసలో దుర్వాసన రావడం మొదలైెంది. దాంతో ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళాడు. CT స్కాన్ తదితర పరీక్షలు చేయడంతో అతని శ్వాసనాళంలో కఫంతో నిండిన బొద్దింక కనిపించింది. డాక్టర్లు అతనికి మెరుగైన వైద్యం చేసి అతని శ్వాసనాళాన్ని శుభ్రం చేసారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంత మొద్దు నిద్ర ఏంటి బ్రో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.