కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ సెంటిమెంట్..!
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ సెంటిమెంట్‌పైనే ఆధారపడింది. ప్రచారంలో తొలి రోజు మునుగోడు ఆడబిడ్డను వచ్చానంటూ కొంగు చాపి ఓట్లు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. చివరి రోజు సభలో కంట తడి పెట్టి ఓటర్ల సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. మునుగోడులో మంగళవారం నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదని.. కంటతడి పెట్టనీయకండి.. నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించి గెలిపించండి.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముక్తాయింపు ఇచ్చారు. స్రవంతిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారు.