Home Page SliderNational

విపక్షాల రెండో విడత సమావేశం వాయిదా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా..విపక్షాలు ఇటీవల బీహర్‌లోని పాట్నాలో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పాట్నాలో విపక్షాల మొదటి విడత సమావేశం అనుకున్న సమాయానికే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13,14 తేదీల్లో   బెంగుళూరులో జరగాల్సిన విపక్షాల రెండో విడత సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా దేశంలో ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ నెల 10 నుంచి బీహర్ అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవబోతున్నాయి. ఈ తరుణంలో భేటీని వాయిదా వేయాలని విపక్షాలు నిర్ణయించాయి. కాగా తదుపరి భేటీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని JDU వెల్లడించింది. అయితే విపక్షాల తొలి సమావేశం బీహర్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగ్గా 19 పార్టీల నేతలు పాల్గొన్నారు.