34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల
టీడీపీ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో 94 మంది సభ్యుల జాబితా విడుదల చేసిన పార్టీ తాజాగా మరో 34 మంది లిస్టును విడుదల చేసింది. పెదకూరపాడు టికెట్ భాష్యం ప్రవీణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. గురజాల సీటును యరపతినేని శ్రీనివాసరావుకు, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌరికి ఇచ్చారు. గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజీర్ కు ఇచ్చారు. మదనపల్లి షాజహాన్ భాషా, పూతలపట్టు కిలికిరి మురళీ మోహన్, సత్యవేడు ఎస్సీ-కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి-బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కదిరి-కందికుంట యశోదాదేవి, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డికి కేటాయించారు.

