Home Page SliderNational

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ లో రెండో రోజు కూడా రణరంగమే..

వరుసగా రెండో రోజు కూడా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రణరంగంగా మారింది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీని రణరంగంగా మార్చారు. నేడు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే తంతు కొనసాగింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కుప్వారా ఎమ్మెల్యే బ్యానర్ ప్రదర్శించడం ఘర్షణకు కారణమైంది. ఆ బ్యానర్ చూసిన వెంటనే ‘భారత్ మాతా కీ’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను ప్రశాంతంగా కొనసాగడానికి స్పీకర్ అబ్దుల్ రహీమ్ మార్షల్స్ ను పిలిచి వెల్ లోకి దూకిన బీజేపీ ఎమ్మెల్యేను బయటకు పంపారు.