Home Page SlidermoviesTelanganatelangana,

మూడవరోజూ కొనసాగుతున్న సోదాలు

హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు ఇళ్లలో ఐటీ సోదాలు మూడవరోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మూడు రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఆయనతో పాటు మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసులలో కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. వీరి వ్యాపార లావాదేవీల పత్రాలను, బ్యాంకు లాకర్లను పరిశీలిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థల ఆదాయానికి, పన్ను చెల్లింపులకు భారీ తేడాలను గుర్తించామని, ప్రాధమికంగా లభించిన ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు జరుపుతున్నామని తెలిపారు.