Home Page SliderTelangana

చెట్లలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..

కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇవాళ ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులతో చిట్యాల నుంచి కామారెడ్డికి వెళ్తుంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. బస్సులోని స్టూడెంట్స్ క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.