Home Page SliderInternational

ఈ నెంబర్ కాల్స్  లిఫ్ట్ చేస్తే అంతే సంగతులు..

సైబర్ నేరగాళ్లు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు. పాకిస్తాన్ నుండి వచ్చే 92 అని మొదలయ్యే నెంబర్ ఫోన్ కాల్స్‌ను తీస్తే అంతే సంగతులంటున్నారు పోలీసులు. వారు పాకిస్తాన్ నుండి ఫోన్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, క్షణాల్లో అకౌంట్లు ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. పోలీస్ యూనిఫాం ధరించిన ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకుని చీటింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్ కాల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. తాము పోలీసులమని, మీపై కేసు నమోదయ్యిందని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని రకరకాలుగా భయపెడుతున్నారు. ఇలాగే ఆగ్రాకు చెందిన ఒక మహిళను వేధిస్తే ఆమె గుండెపోటుతో మరణించింది. ఆమె ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ ఉండగా, ఆమెకు ఫోన్ చేసి, నీ కుమార్తె సెక్స్ రాకెట్‌లో దొరికింది. డబ్బు ఇస్తే వదిలేస్తాం అని చెప్పడంతో ఆమె గుండె ఆగిపోయి మృతి చెందింది. అందుకే ఎలాంటి ఫోన్లు తెలియని నెంబర్ల నుండి వస్తే లిఫ్ట్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.