home page sliderHome Page SliderTelangana

ప్రజల కోసం వేసిన రోడ్డు.. మీ జాగీరా..

ప్రజల కోసం ప్రభుత్వం వేసిన రోడ్డును ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో రోడ్ ను ASBL అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఆక్రమించింది. 5 ఎకరాల పైచిలుకు భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టింది. ASBL లోఫ్ట్ లో ప్రీలాంచ్ పేరుతో అమ్మకాలు జరుపుతోంది. పెద్ద బండ రాళ్లతో రోడ్ ను బ్లాక్ చేసి కంటైనర్లు ఏర్పాటు చేసి ASBL పనులు చేపడుతోంది. ASBL లోఫ్ట్ లో 3 భారీ టవర్ల నిర్మాణం కూడా చేపట్టింది. రెరా అప్రూవ్డ్ అంటూ ఆక్రమించిన రోడ్డుపైనే టెంట్లు వేసి అమ్మకాలు చేస్తోంది. ఆక్రమించిన రోడ్డులో మార్కెటింగ్ సేల్స్ కార్యాలయం, కంటైనర్లు, బాత్రూంలు ASBL కంపెనీ నిర్మించింది.