మిగిలిన సంస్థలే కీలకమని, వీటిపై చర్చ జరగాలని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూలు – 9లోని మొత్తం ఆస్తుల విలువలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా కేవలం 0.7 శాతం మాత్రమేనని, మిగిలిన సంస్థలే కీలకమని, అన్నింటినీ కలిపి జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని.. ఇలా కాకుంటే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది.