Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు దక్కని ఊరట… రిమాండ్ నవంబర్ 1 వరకూ పొడిగింపు

చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులో ఇంకా ఊరట దక్కలేదు. ఆయన రిమాండ్‌ను నవంబర్ 1 వరకూ పొడిగించారు. ఈ వాయిదాతో ఈ కేసులో ఆయన రిమాండ్‌ను మూడవసారి పెంచినట్లయ్యింది. మరో 14 రోజుల పాటు ఆయన రిమాండ్ పెరిగింది. నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ విషయంలో వాదనలు జరిగాయి. జైలులో తన భద్రతకు, ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలున్నాయని ఏసీబీ కోర్టు జడ్జి ముందు వర్చువల్‌గా తెలియజేశారు చంద్రబాబు. అలాంటివేవైనా ఉంటే లిఖిత పూర్వకంగా తనకు పంపించాలని, సీల్డ్ కవర్‌లో తనకు అందజేయాలని సెంట్రల్ జైలు అధికారులను  ఆదేశించారు న్యాయమూర్తి. అలాగే చంద్రబాబు మెడికల్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని న్యాయమూర్తి తెలిపారు.  హైకోర్టులో స్కిల్ కేసు పెండిగులో ఉన్నందువల్ల రిమాండ్‌ను పొడిగించినట్లు తెలియజేశారు.