Home Page SliderNational

మరింత ఆలస్యం కానున్న పుష్ప-2 రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప-2. గతంలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఇది రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు పుష్ప-2 సినిమా డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతోనే రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు సమాచారం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పుష్ప సాంగ్,సూసేకి అగ్గిరవ్వ సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.