టెర్రరిస్టుల దాడులకు కారణం పాకిస్తానే
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల దాడులకు పాకిస్తానే కారణమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇకపై ఇటువంటి దాడులకు ఆ దేశం ముగింపు పలకాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయిని హెచ్చరించారు. ఇండియాతో స్నేహపూర్వకంగా ఉండేందుకు సరైన మార్గం ఎంచుకోవాలని ఫరూక్ సూచించారు. 30 ఏండ్లుగా అమాయక ప్రజలను మర్డర్ చేయడం చూశానన్నారు. నాతో కలిసి పని చేసిన ఎందరో అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ టెర్రరిస్టు దాడులకు ముగింపు పలకాలని తెలిపారు. ఇండియాతో స్నేహంగా ఉండేందుకు ఒక మార్గాన్ని కనుగొనాలని అబ్దుల్లా సూచించారు.

