నా విజయానికి కారణం మా అమ్మ, నాన్న
అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. దీంతో ఆమెకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషని ఆదర్శంగా తీసుకొని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా త్రిష మీడియాతో మాట్లాడుతూ.. అండర్ 19 వరల్డ్ కప్ లో మేము పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కింది. ఇక నుండి మరింత కష్టపడి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆమె పేర్కొంది. మెగా టోర్నీలో ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదన్నారు. నాకు సహకరించి, అభిమానించిన అందరికీ ధన్యవాదాలు. మిథాలీ రాజ్ తనకు ఇన్స్పిరేషన్ అని త్రిష చెప్పుకొచ్చింది. వరల్డ్ కప్ సాధించిన టీమ్‌లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. నా విజయానికి కారణం మా అమ్మ, నాన్న. గతంలో నాకు అవకాశాలు రాలేదు.. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ టోర్నీగా ఉండటం సంతోషంగా ఉందని త్రిష చెప్పుకొచ్చింది.

