Home Page SliderNational

నా స్థితికి కారణం మా కుమార్తే -సుధామూర్తి

ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురించి అందరికీ తెలుసు. ఆమె గొప్ప మహిళగా ఎన్నో కీర్తిశిఖరాలు అధిరోహించారు. ఆమె దాతృత్వం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్యూలో ఆమె దాతృత్వానికి కారణం  తన కుమార్తె అక్షతామూర్తి అని వెల్లడించారు. ఆమె రచయిత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఎంత సంతృప్తి ఉంటుందో తన కుమార్తె తెలియజేసిందన్నారు. ఆమె కుమార్తె మాజీ బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ భార్య అక్షతా మూర్తి అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె తన పిల్లల చిన్నప్పుడు వారికి డబ్బు ఇచ్చేదాన్ని కాదని, వారికి ఏది కావాలన్నా తానే ఆలోచించి కొనిపెట్టేదాన్ని అని చెప్పారు. ఒకసారి ఒకరికి సహాయం కోసం తన కుమార్తె అడిగిన డబ్బును కూడా ఇవ్వక పోతే అక్షత అడిగిన ప్రశ్నలకు నాడు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉన్న గొప్పతనాన్ని కుమార్తె వల్లనే తాను గుర్తించానని ఆమె తెలిపారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.