అతడే ఒక సైన్యం..
తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అతికొద్ది మందిలో బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేసిన ఈటల ఇప్పుడు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజల కోసం బీజేపీ పక్షాన కొట్లాడుతున్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు… తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు భారతీయ జనతా పార్టీలో అతడే ఓ సైన్యంలా రేయంబవళ్లూ కష్టపడుతున్నారు ఈటల. మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర పార్టీ, ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ హోదా ఇచ్చి గౌరవించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన పార్టీ… ఇప్పుడు జోడు గుర్రాల ద్వారా తెలంగాణలో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల అమలు బాధ్యతను ఈటలకు అప్పగించిన ఢిల్లీ పెద్దలు, అందుకు తగిన విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన ఈటల రాజేందర్… వచ్చే రోజుల్లో పార్టీని అధికారంలోకి ఏ విధంగా తేవాలన్నదానిపై అనేక దఫాలుగా… విడతల వారీగా వివిధ వర్గాలు మేధావులు, నిపుణులు, ఉద్యమకారులతో చర్చలు జరిపారు . ప్రధాన నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, ఇందుకు సంబంధించి సవివరమైన నివేదికలను ఈటల అందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారుపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలిచేందుకు ఆయన అహరహరం కృషి చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఈటల.. కార్యకర్తలకు మనో ధైర్యాన్ని అందించడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదానిపై నాయకగణానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిత్యం వందల మంది వేల మంది కార్యకర్తలతో సమావేశం అవుతూ… వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ఆయన శ్రమిస్తున్నారు.

ప్రజా వ్యతిరేకతతో కూనరిల్లుతున్న కేసీఆర్ సర్కారును ఢీకొట్టడంతోపాటు, అస్తవ్యస్థ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఎలా అన్నదానిపై ఆయన పూర్తి స్థాయిలో కరసత్తు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికి ఎప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలను అందుకుంటుందంటూ తాజాగా వచ్చిన రెండు జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలు ఘోషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ప్రజలను భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచించే విధంగా చేసేలా ప్రచార కార్యక్రమానికి ఈటల శ్రీకారం చుట్టారు. అందుకు తగినట్టుగానే ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి అధినాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీ కొట్టే ఒక్క మగాడు ఈటల మాత్రమే నన్ను భావన తెలంగాణ జనంలో పాతుకు పోయింది. తెలంగాణ ఉద్యమకారులు, రాజేందర్‌ను భావి అధినాయకుడిగా భావిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్ ఆశాజ్యోతిలా కన్పిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే అది ప్రజలకు తద్వారా భారతీయ జనతా పార్టీకి స్వప్నం నెరవేరినట్టుని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, తెలంగాణపై చాన్నాళ్లుగా దృష్టి పెట్టింది. అయితే అనుకోని అవాంతరాలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ అంతట అధికార పార్టీ బలహీన పడాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేలా కొందరు వ్యవహరించిన తీరును కళ్లారా చూశాం. అందుకే పార్టీ హైకమాండ్ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి.. ఎన్నికలకు ముందు పార్టీని పూర్తి స్థాయిలో రీవాంప్ చేసింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ కు ఎలక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ టాస్క్ పూర్తి చేసేందుకు ఈటల పూర్తిగా ప్రజల్లో మమేకమవుతున్నారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను, గోసను వింటూ వారిలో భవిష్యత్ పై నమ్మకం కలిగిస్తున్నారు.

