మేడిగడ్డ కొట్టుకుపొతాదని చేసిన ప్రచారం వట్టిదే.. KTR
మేడిగడ్డ కొట్టుకుపోతుందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం వట్టిదని మండిపడ్డారు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. నేడు కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ పరిశీలన అనంతరం బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా కామెంట్స్ చేశారు. “సాగు నీటి రంగములో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసిఆర్ .బీడు భూములు సాగు లోకి తెచ్చిన వ్యక్తి కేసిఆర్. పంజాబ్ ,హర్యానా ను వెనక్కు నెట్టి, ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. అధికారులు పదే పదే చెప్తున్నారు..అన్ని డ్యాం లను పంపింగ్ చేసి నింపాలని..కాళేశ్వరం నీటి నీ పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్ లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశ్యముతో మా ఎమ్మెల్యేల బృందం బయలుదేరాము.. 10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకొని బ్రహ్మాండంగా మేడి గడ్డ నిలబడి ఉంది… లక్షల కోట్లు వృధా అయ్యాయి అని మా పార్టీ నీ బధునం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి
మేడిగడ్డ మేడిపండు అయింది అంటున్నారు. రేపు ప్రకృతి సహకరిస్తే మేడి గడ్డ ,కన్నె పల్లి సందర్శిస్తాము. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటన ను భూతద్దంలో చూపించి విఫల ప్రాజెక్టు అని అబద్దపు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఎన్నికలు ఐపోయాయి ముఖ్యమంత్రి, రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యాం లకు పంపింగ్ చేయండి”. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేటీఆర్.

