ప్రచార పోరు తీవ్రం.. ఇంటింటికీ పసుపు సైన్యం
తానెలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డికీ తెలుసు. అతని వైఫల్యాలు, అరాచక విధానాలను ఎండగడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకేమో నానాటికీ ప్రజాదరణ పెరుగుతోంది.
బాబు బయట ఉంటే తాను రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టమని జగన్ భావించారు. అందుకే అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించారు. ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రజా వ్యతిరేక, అరాచక ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అంటూ పసుపు సైన్యం తమ ప్రచార పోరును ఉధృతం చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, మహిళలు బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తొలుత ఆయన క్షేమాన్ని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ.. కరపత్రాలు పంచుతూ వైకాపా ప్రభుత్వ అరాచకాలు, వేధింపులు, అన్యాయాలను ఓటర్లకు వివరించారు.