Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ చేస్తామంటున్న నిర్మాతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  వరుస సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి వారాహి యాత్ర కూడా ప్రారంభించనున్నారు. కాగా ఈ యాత్ర కోసం మంగళగిరి జనసేన  పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చండీ యాగం కూడా నిర్వహించారు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ప్రచారం చేయడానికి ప్రజల్లోకి వెళ్లాల్సివుంది. దీనిలో భాగంగానే ఆయన ఏపీలో రేపటి నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విధంగా ఆయన రేపటి నుంచి రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోనున్నారు. ఇకపై  వారాహి యాత్రతోపాటు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో సినీ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ రాబోయే సినిమాలను మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రేపటి నుంచి పవన్ ప్రజల్లోనే ఉంటారు.కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడే షూటింగ్ జరిపేలా ఏర్పాట్లు చేస్తామని సినీ నిర్మాతలు స్పష్టం చేశారు.