జైలులో భగత్‌సింగ్… తండ్రినీ చూడనివ్వని బ్రిటీష్ పాలకులు
ఎందరో వీరుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించింది. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక స్వతంత్ర సమరయోధులు ఎన్ని కష్టనష్టాలకోర్చుకున్నారో, తల్లిదండ్రులకు, అయిన వారికి దూరమై ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో భగత్‌సింగ్ స్వహస్తాలతో వ్రాసిన ఈ లేఖ చూస్తే తెలుస్తుంది. తన తండ్రిని కలవడానికి జైలు సూపరిండెంట్‌ను ప్రాధేయపడుతూ లేఖ రాసారు భగత్‌సింగ్. ఢిల్లీ కేసుకు సంబంధించి తన ఢిఫెన్స్ లాయర్‌కు సూచనలు ఇవ్వాలని, దానికోసం దయచేసి తన తండ్రితో మాట్లాడేందుకు అనుమతినిమ్మని వ్రాసారు.
విప్లవకారులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ అరెస్టు చేసి, ఉగ్రవాదులుగా ముద్రవేసి, 1931,మార్చి23 వతేదీన లాహోర్ జైలులో ఉరి తీశారు. స్వతంత్ర్యానంతరం అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఈ రోజును అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్)గా ప్రకటించారు.