అమ్మాయిల హాస్టల్‌ను బార్‌గా మార్చిన ప్రిన్సిపాల్
గురుకుల హాస్టల్‌లో మహిళా ప్రిన్సిపాల్ బీర్లు తాగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా గురుకుల హాస్టల్ కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. బీర్లు తాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చోటు చేసుకుంది. గురుకుల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయం గురించి అడిగితే డిగ్రీ విద్యార్థులు అని కూడా చూడకుండా తమను కొడుతుందని వారు నిరసన తెలిపారు. కాగా విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

