Home Page SliderNational

ఆ అభిమానికి బూట్లు ధరించిన ప్రధాని

మోదీ ప్రధాని అయ్యేవరకు బూట్లు ధరించనని 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశాడు ఓ అభిమాని. హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ చేశాడు. 2014లో ప్రధాని పీఠం ఎక్కి తన కోరిక నెరవేరినప్పటికీ.. రాంపాల్ కశ్యప్ మోదీని కలవలేకపోయాడు. ప్రధాని సోమవారం(ఏప్రిల్‌ 14) హర్యానాకు వచ్చిన ఈ విషయం తెలుసుకుని.. స్వయంగా రాంపాల్ కశ్యప్‌కు మోదీ ఫోన్ చేసి పిలిపించారు. అతనిని ఆప్యాయంగా కలిసి స్పోర్ట్స్‌ షూ బహుమతి ఇచ్చారు ప్రధాని. షూ ఇవ్వడమే కాకుండా కశ్యప్‌ బూట్లు ధరిస్తుంటే ఆయనకు సహాయం కూడా చేశారు మోదీ. మరొక్కసారి ఇలాంటి ప్రతిజ్ఞ చేయకూడదని ఆ అభిమానితో అన్నారు. కష్టపడి పైకి రావాలి కానీ ఇలాంటివి చేయకూడదని కశ్యప్ ను సూచించారు.